గూగుల్‌ ట్రిక్‌తో ఎమోజీల సృష్టి

ABN , First Publish Date - 2022-05-21T07:03:56+05:30 IST

మొబైల్‌ మాదిరిగానే పర్ఫెక్ట్‌ కమ్యూనికేషన్‌లో ఎమోజీలు కూడా భాగమయ్యాయి.

గూగుల్‌ ట్రిక్‌తో ఎమోజీల సృష్టి

మొబైల్‌ మాదిరిగానే పర్ఫెక్ట్‌ కమ్యూనికేషన్‌లో ఎమోజీలు కూడా భాగమయ్యాయి. ఆనందం నుంచి విషాదం వరకు దెప్పిపొడవడం నుంచి సంఘీభావాన్ని తెలిపే వరకు దాదాపుగా అన్నింటికీ తమ భావాన్ని వ్యక్తం చేసేందుకు ఎమోజీలు ఉన్నాయి. అసలు విషయానికి వస్తే గూగుల్‌కు ఎమోజీ కిచెన్‌ ఉంది. పేరుకు తగ్గట్టు సిరీ్‌సల కొద్దీ ఎమోజీలు అందులో ఉన్నాయి. ఎమోజీ కిచెన్‌ ప్రాథమికంగా జీబోర్డ్‌ ఫీచర్‌. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మాత్రం ఈ ఎమోజీలను కలగలిపి  లేదా విస్తరించుకుని కొత్తవాటిని రూపొందించుకుని, ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. సుమారుగా నలభై వేల కాంబినేషన్‌లకు అవకాశం వాటితో ఉంటుంది. ఉదాహరణకు మంకీ ఎమోజీకి టోపీ తగిలించుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఎలాగంటే..


మీ ప్రిఫర్డ్‌ చాట్స్‌ నుంచి ఒకటి ఓపెన్‌ చేసుకోవాలి. అక్కడి నుంచి గూగుల్‌ జీబోర్డ్‌ను పొందాలి.

జీబోర్డ్‌లో ఎమోజీ ఐకాన్‌ను టాప్‌ చేయాలి.

స్పార్కల్‌ లేదంటే స్మయిలింగ్‌ ఎమోజీని, మీరు అనుకుంటున్న ఎమోజీని కలుపుకోవాలి. 

సెలెక్ట్‌ చేసుకున్న రెండు ఎమోజీలతో అంటే కొత్త క్రియేషన్లతో పాపప్‌ జాబితా అవుతుంది. 

వాటిలో నుంచి ఏదో ఒకటి తీసుకుని చాట్స్‌ ద్వారా పంపుకోవచ్చు.

Updated Date - 2022-05-21T07:03:56+05:30 IST