సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్?

ABN , First Publish Date - 2020-06-04T02:47:08+05:30 IST

అమరావతి భూముల కేసులో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ మాధురుని సిట్ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. తుళ్లూరు మండలం నెక్కల్లులో...

సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్?

గుంటూరు: అమరావతి భూముల కేసులో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ మాధురిని సిట్ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. తుళ్లూరు మండలం నెక్కల్లులో సీఆర్డీఏ అధికారిగా మాధురి పని చేశారు. మూడెకరాల భూమి, ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అయితే మాధురి అరెస్ట్‌ను సిట్ పోలీసులు ధ్రువీకరించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సిట్ పోలీసులు గత నెలలో టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2020-06-04T02:47:08+05:30 IST