Abn logo
Oct 19 2020 @ 01:14AM

క్రేజీ కాంబినేషన్‌..

Kaakateeya

దీపికా పడుకోన్‌, ఆలియాభట్‌, రణబీర్‌ కపూర్‌ కలసి నటించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేసిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి. 1952లో వచ్చిన ‘బైజూ బావరా’ చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అక్బర్‌ ఆస్థానంలోని ప్రముఖ గాయకుడు తాన్‌సేన్‌ను ఓడించడానికి తన గానంతో బైజు అనే ఓ అనామక గాయకుడు చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. సంజయ్‌ లీలా భన్సాలీ తొలుత రణవీర్‌సింగ్‌, ప్రియాంకా చోప్రాతో ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నా ఎందుకో ఆ కాంబినేషన్‌ కుదరలేదు. కథ నచ్చడంతో ఇప్పుడు దీపికా, అలియాభట్‌ ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో రణబీర్‌ కపూర్‌కు జంటగా మాతృకలోని మీనాకుమారి పాత్రను ఆలియాభట్‌  పోషించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement