Advertisement

వాళ్ల మధ్య మ్యాటర్... ‘అలా మొదలైంది!’

ప్రేమ బావుంటుంది. ప్రేమ పెళ్లి ఇంకా బావుంటుంది. కానీ, లవ్ మ్యారేజ్ తరువాత డైవోర్సే మనసుకు కష్టంగా ఉంటుంది. అయినా చాలా ప్రేమ జంటలు కొన్నాళ్లకో, కొన్నేళ్లకో విడిపోతుంటాయి. అదే సమయంలో, విడిపోని... విధిని జయించినవి... కూడా ఉంటాయి! మామూలు లవ్వర్స్ సంగతేమోగానీ సెలబ్రిటీ కపుల్స్ మాత్రం ఎంత ఎక్కువ కాలం కలిసుంటే అంత ఆశ్చర్యమే! అటువంటి కొందర్ని ఇప్పుడు చూద్దాం. విజయవంతంగా సంసార సాగరం ఈదేస్తోన్న ఆ గ్లామరస్ జోడీల ఫస్ట్ డేట్‌పైన కూడా ఓ లుక్ వేద్దాం... 

సైఫీనా... 14 ఏళ్లు!

సైఫ్, కరీనా జంట గురించి కొత్తగా చెప్పేదేం లేదు. చోటే నవాబ్‌కి రెండో పెళ్లి, బెబోకి మొదటి పెళ్లి... అయినా కూడా ఎక్కడా తేడా రాలేదు. 14 ఏళ్లుగా ఇప్పటికీ అన్యోన్యంగా కాపురం కానిచ్చేస్తున్నారు బీ-టౌన్ స్టార్ కపుల్. వీరి ఫస్ట్ పబ్లిక్ అప్పియరెన్స్ 2007లో జరిగింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా ‘సైఫీనా’ కెమెరాలకు కలసి ఫోజులిస్తూ సంచలనం సృష్టించారు!

4 ఏళ్లనాటి... వి‘దేశీ‘ లవ్ స్టోరీ! 

దేసీ గాళ్‌గా భారతీయ కుర్రాళ్ల మదులు దోచిన డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా అమాంతం అమెరికాకు ఎగిరి వెళ్లిపోయింది. ఇప్పుడామె గ్లోబల్ స్టార్. లాస్ ఏంజిలిస్‌లో కాపురం పెట్టేసిన మన ముంబై ముద్దుగుమ్మ మిసెస్ జోనాస్‌గా యూఎస్‌లో తెగ పాప్యులర్. అయితే, నిక్ అండ్ పీసీ ఫస్ట్ మీడియా అప్పియరెన్స్ 2017లో చోటు చేసుకుంది. ఓ హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోకి ఇద్దరూ ‘వేరు వేరు’గా  అటెండ్ అయ్యారు. కెమెరాలకి కూడా ఊరికే కర్టసీ కోసం కలసి ఫోజిచ్చారు. కానీ, సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం మిష్టర్ అండ్ మిసెస్ జోనాస్ క్రేజీ జోడీగా దుమ్మురేపుతున్నారు! 

2014లో... దీపిక లైఫ్‌లోకి ‘గెస్ట్ హబ్బీ’!

రణవీర్, దీపికా బీ-టౌన్‌లోని క్రేజియెస్ట్ కపుల్స్‌లో ఒకరు. అయితే, మిస్ పదుకొణే జీవితంలోకి మిష్టర్ సింగ్ ఎలా కాలుమోపాడో తెలుసా? ‘గెస్ట్ హబ్బీ’గా! అవును, ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో రణవీర్ సింగ్ అతిథి పాత్రలో కనిపించాడు. హీరోయిన్‌కి దీపికకి అతను భర్త! నిజ జీవితంలోనూ తరువాత అదే నిజమైపోయింది! గెస్ట్ రోల్‌లో వచ్చిన రణవీర్ ఫుల్‌టైం హజ్బెండ్‌గా మారిపోయాడు. 

విరుష్క... 2013 నుంచీ కొనసాగుతోన్న ‘రొమాంటిక్ టెస్ట్ మ్యాచ్’!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... వీరిద్దర్నీ ‘విరుష్క’ అనటం అభిమానులకి, మీడియాకి మామూలే. అయితే, విరుష్క వివాహానికి బీజం పడింది మాత్రం ఓ యాడ్ షూట్‌లో. షాంపు కంపెనీ కోసం కెమెరా ముందుకొచ్చిన స్టార్ క్రికెటర్ అండ్ స్టార్ బ్యూటీ ప్రేమ జలపాతంలో తలంటూ పోసుకుని నిండా ప్రణయంలో తడిసిపోయారు! ఇదంతా 2013లో జరగ్గా ఇప్పుడు వీరిద్దరూ నాట్ జస్ట్ లవ్వర్స్, నాట్ జస్ట్ వైఫ్ అండ్ హజ్బెండ్... గారాల కూతురికి మమ్మీ, డాడీ కూడా!

‘ట్వింకిల్ ట్వింకిల్’ ‘ఖిలాడి’ స్టార్!

బాలీవుడ్‌ సెలబ్రిటీల పెళ్లిల్లు చాలా పెద్ద న్యూస్. వారి విడాకులు అంతకంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్. కానీ, అక్షయ్ అండ్ ట్వింకిల్ చాలా చాలా డిఫరెంట్! ఏకంగా రెండు దశాబ్దాలుగా బలంగా కొనసాగుతోంది వీరి వైవాహిక బంధం! ఫిల్మేఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన ఒక షూట్‌లో తొలిసారి కలుసుకున్నారట మిష్టర్ కుమార్, మిస్ ఖన్నా. 2001లో ఇది జరగ్గా ఇప్పటికీ స్ట్రాంగ్‌గా కంటిన్యూ అవుతోంది వీరి రొమాన్స్. తమ ఇద్దరు టీనేజ్ పిల్లలతో కలసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు బాలీవుడ్ సీనియర్ కపుల్!

Advertisement

Bollywoodమరిన్ని...