స్వామి అమ్మవార్లకు ఊయల సేవ

ABN , First Publish Date - 2022-01-29T04:45:14+05:30 IST

శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణం కోసం శుక్రవారం స్వామిఅమ్మవార్లకు ఊయలసేవను ఘనంగా నిర్వహించారు.

స్వామి అమ్మవార్లకు ఊయల సేవ
స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీశైలం, జనవరి 28: శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణం కోసం శుక్రవారం స్వామిఅమ్మవార్లకు ఊయలసేవను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతికి పూజ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊయలలో ఆశీనులను జేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు చేశారు. అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల,  సహస్ర నామార్చన పూజలు నిర్వహించి మంగళ హారతులను ఇచ్చారు. అలాగే గ్రామదేవత అంకాలమ్మకు విశేష పూజలు చేశారు. ఈ పూజలలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, హరిద్రో దకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేష అలంకరణ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-01-29T04:45:14+05:30 IST