Abn logo
Jul 13 2020 @ 12:21PM

ఓటీటీలో ‘క్రాక్‌’..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ చిత్రం ‘క్రాక్‌’. ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ఉండుంటే ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఎలాగో సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేద్దామంటే ఇంకా థియేట‌ర్స్ ఓపెన్ కానందున కొంత మంది నిర్మాత‌లు వారి సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేస్తున్నారు. అదే బాట‌లో క్రాక్ సినిమాను విడుద‌ల చేస్తే ఎలా ఉంటుందా? అని మేక‌ర్స్ ఆలోచన‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియా టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement