కొంగ మోసం!

ABN , First Publish Date - 2020-07-26T05:30:00+05:30 IST

ఒక అడవిలో ఒక ముసలి కొంగ నివసిస్తూ ఉండేది. సులువుగా తిండి లభించాలని చూసేది. ఎలాగైనా కష్టపడకుండా సరస్సులో ఉన్న చేపలను తినాలని ఒక పథకం వేసింది. ఒకరోజు సరస్సు ఒడ్డున దీనంగా ముఖం పెట్టి కూర్చుంది. అది చూసి సరస్సులోని ఒక చేప ‘ఏమైంది’ అని అడిగింది...

కొంగ మోసం!

ఒక అడవిలో ఒక ముసలి కొంగ నివసిస్తూ ఉండేది. సులువుగా తిండి లభించాలని చూసేది. ఎలాగైనా కష్టపడకుండా సరస్సులో ఉన్న చేపలను తినాలని ఒక పథకం వేసింది. ఒకరోజు సరస్సు ఒడ్డున దీనంగా ముఖం పెట్టి కూర్చుంది. అది చూసి సరస్సులోని ఒక చేప ‘ఏమైంది’ అని అడిగింది. ‘కొద్దిరోజుల్లోనే కరువు రాబోతోంది. సరస్సులో ఉన్న జీవులన్నీ చనిపోతాయి. అది తలచుకుని బాధపడుతున్నాను’ అని కొంగ చెప్పింది. అది విన్న చేప ‘ఎలాగైనా నాకు సహాయం చేయవా!’ అని అడిగింది. అందుకు సరేనంటూ ‘ఇక్కడికి దగ్గరలో మరో సరస్సు ఉంది. అందులో నీరు నిండుగా ఉంది. నిన్ను అక్కడకు చేరుస్తాను’ అంది కొంగ. అలా రోజూ ఒక్కో చేపను నమ్మించి, నోట కరుచుకుని తీసుకెళ్లి తినేది. ఒకరోజు ఎండ్రకాయను కూడా అలానే తినాలనుకుంది. దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్లింది. దారిలో ఒకచోట చేపల ఎముకలు కుప్పలుగా పడి ఉండటం ఆ ఎండ్రకాయ గమనించి, కొంగను అడిగింది. అప్పుడు కొంగ ఏమాత్రం తడుముకోకుండా ‘అవన్నీ నేను తిన్న చేపల ఎముకలే. ఇప్పుడు నిన్నూ తినబోతున్నాను’ అని అంది.  ప్రమాదాన్ని పసిగట్టిన ఎండ్రకాయ తన గోళ్లతో కొంగ మెడను గట్టిగా పిసికి చంపేసింది.

Updated Date - 2020-07-26T05:30:00+05:30 IST