సీ పీ ఎస్ శ్రేణులకు పండగా..దండగే

ABN , First Publish Date - 2020-10-21T23:06:30+05:30 IST

సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ భాగస్వామ్య పింఛను పథకం రద్దు కానంత వరకు సీ పీ ఎస్ ఉద్యోగుల కు

సీ పీ ఎస్ శ్రేణులకు పండగా..దండగే

హైదరాబాద్: సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ భాగస్వామ్య  పింఛను పథకం రద్దు కానంత వరకు సీ పీ ఎస్ ఉద్యోగుల కు ఏ పండగ ఐనా దండగనే అని కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ( సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్) రాష్ట్ర అధ్యక్ష , ప్రచార కార్యదర్శులు దాముక కమలాకర్, మాచన రఘునందన్ లు పేర్కొన్నారు. నిర్మల్ కు చెందిన ఓ ఉపాధ్యాయుడు రాజేష్ అనారోగ్యం తో మరణించడం కలచి వేసిందనీ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత టీచరు కుటుంబానికి ఉపాధ్యాయ, ఉద్యోగ శ్రేణులు విరాళాలు సేకరించి లక్షా అరవై  ఐదు వేల రూపాయలు అందించామని చెప్పారు. కొత్త పింఛను పథకం రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధించాలని కోరుతూ.. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ముఖ్య మంత్రులకు పోస్ట్ కార్డ్ ద్వారా లక్షలాదిగా ఉత్తరాలు పంపుతూ, సీ పీ ఎస్ శ్రేణులు తమ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ  సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ వివరించారు.


అందుకే దేశమంతా జనం దుర్గాష్టమి, విజయ దశమి, దసరా పండుగ తో సరదాగా ఉంటే సీ పీ ఎస్ , ఎన్ పీ ఎస్ శ్రేణులు మాత్రం ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే బతుకు భరోసా లేని "టెన్షన్" పెన్షన్ స్కీమ్ లో ఉన్నామని ఆందోళనకు గురవుతున్నారు అన్నారు.   చెడు పై మంచి సాధించిన విజయం గా జరుపుకునే ఈ దసరా సందర్భంగా సీ పీ ఎస్ ను కూడా అంతం చేయాలన్న అభిమతం తో తాము ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-10-21T23:06:30+05:30 IST