ఆటంకాలు లేకుండా వంతెనలు నిర్మించాలి

ABN , First Publish Date - 2020-10-24T10:30:55+05:30 IST

పంట పొలాల వద్ద మురుగు పోవడానికి ఆటంకాలు లేకుండా కేఎల్‌యూ వారికి వంతెనలు నిర్మించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు.

ఆటంకాలు లేకుండా వంతెనలు నిర్మించాలి

కేఎల్‌యూ యాజమాన్యంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు


తాడేపల్లి, అక్టోబరు 23: పంట పొలాల వద్ద  మురుగు పోవడానికి ఆటంకాలు లేకుండా కేఎల్‌యూ వారికి వంతెనలు నిర్మించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. శుక్రవారం కేఎల్‌యూ ప్రాంతంలో పంట పొలాల వద్ద డ్రెయిన్లను పరిశీలించారు. గుండిమెడ గ్రామ సమీపంలో ప్రాతూరు, చిర్రావూరు, కొండూరు దాటిన అనంతరం నదిలోకి నీరు పోయేలా కాలువల నిర్మాణం చేపడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉం టుందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్య ప్రతినిధులు హామీఇవ్వడంతో రైతులు సంతృప్తి చెందారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణయ్య, రూరల్‌ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కాజ వెంకటేశ్వరరావు, నాయకులు బైరగాని శ్రీనివాసరావు, అమ్మిశెట్టి రంగారావు, పల్లె కృష్ణ, సంసోను, రైతులు మేకల వెంకటశివయ్య, గుంటూరు వెంకటేశ్వరరావు, యాజమాన్య ప్రతినిధి మధుసూదనరావు ఉన్నారు. 


ఎమ్మెల్యే పరిశీలన..

కేఎల్‌యూ పరిసర పంట పొలాల వద్ద ఉన్న డ్రెయిన్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. రైతులకు ఇబ్బం దులు లేకుండా నీటి పారుదల సాగేలా డ్రెయిన్లను నిర్మించా లని ఎమ్మెల్యే చెప్పడంతో యాజమాన్యం సానుకూలంగా స్పం దించింది. ఎమ్మెల్యే వెంట తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-10-24T10:30:55+05:30 IST