ఆన్‌లైన్‌లోనే సీపీఎం రాష్ట్ర మహాసభ

ABN , First Publish Date - 2022-01-21T06:49:56+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు సీపీఎం రాష్ట్ర మూడో మహాసభను ఆల్‌లైన్‌లో నిర్వహి స్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట లోని ఎంవీఎన్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో, మనగాల మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆన్‌లైన్‌లోనే సీపీఎం రాష్ట్ర మహాసభ
సూర్యాపేటలో మాట్లాడుతున్న మల్లు నాగార్జున్‌రెడ్డి

 సూర్యాపేట కల్చరల్‌/మునగాల రూరల్‌/మునగాల జనవరి 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు  సీపీఎం రాష్ట్ర మూడో మహాసభను ఆల్‌లైన్‌లో నిర్వహి స్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట లోని ఎంవీఎన్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో, మనగాల మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడేళ్ల పాలనలో రాజ్యాంగాన్ని బీజేపీ పాతరేసి హిందుత్వ ఎజెండాను అమలు చేసోందని ఆరోపించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. అదే విధంగా ఇటీవల కురిసిన వర్షాలను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర మహాసభను ‘సీపీఐ ఎం సూర్యాపేట’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా వీక్షించాలని కోరారు. సమావేశంలో నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, దండ వెంకట్‌రెడ్డి, చెరుకు యాకలక్ష్మి, నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,  చందా చంద్రయ్య, బచ్చలకూర స్వరాజ్యం,  సైదా, విజయలక్ష్మి, ఉపేందర్‌, కృష్ణారెడ్డి, వెంకటాద్రి పాల్గొన్నారు.



Updated Date - 2022-01-21T06:49:56+05:30 IST