Abn logo
Oct 25 2021 @ 21:58PM

ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ధర్నా, ర్యాలీ

ర్యాలీ నిర్వహిస్తున్న పోరాట కమిటీ సభ్యులు

కావలిటౌన్‌, అక్టోబరు 25: ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఇళ్ల పట్టాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వెంగళరావునగర్‌లో ర్యాలీ నిర్వహించి 22వ వార్డు సచివాలయం వద్ద ధర్నా చేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య మాట్లాడుతూ పట్టణ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో సుమారు 30 ఏళ్లుగా నివాసముంటున్న వందలాది పేద కుటుంబాలకు ప్రభుత్వం తెచ్చిన 225 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట  కమిటీ కన్వీనర్‌ అమర్‌కుమార్‌, సీపీఎం నాయకులు కృష్ణమోహన్‌, నరసింహం, బీ కృష్ణయ్య, సురేంద్ర, షబ్బీర్‌, అంకయ్య, జానీబేగం, తదితరులు పాల్గొన్నారు.