ఉపాధి హామీలో సామాజిక విభజన చర్య హేయం

ABN , First Publish Date - 2021-06-22T06:22:28+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణఉపాధి హమీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ఇచ్చే వేతనాలను సామాజిక తరగతుల ఆధారంగా విభజించి ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేయడం హేయమైన చర్య అని సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మండిపడ్డారు.

ఉపాధి హామీలో సామాజిక విభజన చర్య హేయం
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

సీపీఎం నేత పాశం రామారావు

గుంటూరు (తూర్పు),జూన్‌ 21: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణఉపాధి హమీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ఇచ్చే వేతనాలను సామాజిక తరగతుల ఆధారంగా  విభజించి ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేయడం హేయమైన చర్య అని సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మండిపడ్డారు. ఈ మేరకు బ్రాడీపేటలోని తమ పార్టీ కార్యాలయం  సోమవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కూలీల మధ్య కులాలవారీగా చీలికలు ఏర్పడతాయని, ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఇటువంటి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. తక్షణమే ఈనిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఈమని ఆప్పారావు,  బి. శ్రీనివాసరావు, లక్ష్మణరావు, కిరణ్‌, మహేష్‌, కిన్నెర, సుజాత తదితరులు పాల్గొన్నారు. 

   

Updated Date - 2021-06-22T06:22:28+05:30 IST