వ్యాక్సిన్‌ లేకుండా టీకా ఉత్సవమా?

ABN , First Publish Date - 2021-04-13T06:25:47+05:30 IST

ప్రధాని మోదీ టీకా ఉత్సవం జరపాలని ఘనమైన ప్ర కటన చేశారే కానీ రాష్ట్రాలకు తగినంత టీకా సరఫరా లేదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు విమర్శించారు.

వ్యాక్సిన్‌ లేకుండా టీకా ఉత్సవమా?

ప్రచార ఆర్భాటంగా మారిన వ్యాక్సినేషన్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు

పాయకాపురం, ఏప్రిల్‌ 12 : ప్రధాని మోదీ టీకా ఉత్సవం జరపాలని ఘనమైన ప్ర కటన చేశారే కానీ రాష్ట్రాలకు తగినంత టీకా సరఫరా లేదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు విమర్శించారు. సోమవారం నగరంలోని సచివాలయా లు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరాలో కేంద్రంపై ఒత్తిడి చేయటంలో శ్రద్ధ చూపలేదని, అందుకే ప్రజలు వ్యాక్సిన్‌ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. మొదటి డోస్‌ వేయించుకు న్నవారికి రెండో డోస్‌ అందుబాటులో లేకపోవటం విచారకరమన్నారు. ప్రధాని మోదీ ఎన్ని కలపై పెట్టిన శ్రద్ధ కరోనా కట్టడిలోనూ, వాక్సి న్‌ సరఫరాలోనూ పెట్టలేదని ఆరోపించారు. దే శంలో వ్యాక్సిన్‌ కొరత ఉంటే 6కోట్ల డోసులను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కరోనా కట్టడి, వ్యాక్సిన్ల సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. 

Updated Date - 2021-04-13T06:25:47+05:30 IST