కృష్ణలంకలో ఇంటింటికీ CPM యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-01T15:35:39+05:30 IST

నగరంలోని కృష్ణలంకలో ఇంటింటికీ సీపీఎం యాత్ర ప్రారంభమైంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ ఈ యాత్రలో పాల్గొన్నారు.

కృష్ణలంకలో ఇంటింటికీ CPM యాత్ర ప్రారంభం

విజయవాడ: నగరంలోని కృష్ణలంకలో ఇంటింటికీ సీపీఎం(CPM) యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు(Srinivasa rao), బాబూరావు(Babu rao), దోనేపూడి కాశీనాథ్(Donepudi kasinath) ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో చేపట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. పైకి ప్రకటించేదొకటి.. ఆచరించేది మరొకటని మండిపడ్డారు. ఎక్కడకి వెళ్లినా ప్రజలు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. సంక్షేమ పధకాల పేరుతో ఇస్తూ.. రెట్టింపు వసూళ్లు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ది చెబుతారని శ్రీనివాసరావు హెచ్చరించారు. 


బాబూరావు మాట్లాడుతూ... వైసీపీ వాళ్లు అంతా బాగుందని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పోలీసుల పహరాతో గడపగడపకు వైసీపీ అని వెళుతున్నారన్నారు. ఇంటింటికీ ప్రజాప్రతినిధులు వెళితే .. ప్రజలే వెళ్లగొడతారని అన్నారు. ప్రధాని మోదీ(Modi), సీఎం జగన్‌(Jagan)లు పోటీలు పడి భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. ఒక్క అభివృద్ధి పని, ఒక్క ప్రాజెక్టు చేశామని చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్లో ఎంత ఆవేదన, ఆగ్రహం ఉన్నాయో అర్ధం అవుతున్నాయన్నారు. 


దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ... సంక్షేమం ప్రభుత్వం కాదు... సంక్షోభ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని అన్నారు. విద్యుత్ చార్జీలు, పన్నుల భారాలతో అల్లాడుతున్నారని తెలిపారు. గ్యాస్, పెట్రోల్ ధరల వల్ల ఇతర నిత్యావసర వస్తువులు పెరిగాయాయని అన్నారు. సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితికి తెచ్చారన్నారు. పాలకులు తీరు మార్చుకోక పోతే... ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-01T15:35:39+05:30 IST