Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాశం

వరుసగా మూడోసారి రామారావు ఎన్నిక

తెనాలి అర్బన్‌, అక్టోబరు 23: సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెనాలి ఎన్జీవో కల్యాణ మండపంలో  శనివారం సీపీఎం జిల్లా మహాసభలు ముగింపు సభలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మూడో పర్యాయం పాశం రామారావు ఎన్నికయ్యారు. కార్యదర్శివర్గ సభ్యులుగా వై.నేతాజీ, ఎన్‌.భావన్నారాయణ, ఎం.రవి, కె.నళినికాంత్‌, ఈమని అప్పారావు, సంగయ్య, సభ్యులుగా డి.వెంకటరెడ్డి, టి.కృష్ణమోహన్‌, బి.వెంకటేశ్వర్లు, డి.లక్ష్మీనారాయణ, కె.అజయ్‌కుమార్‌, బి.శ్రీనివాసరావు, సిహెచ్‌.మణిలాల్‌, బి.లక్ష్మణరావు, సుధాకిరణ్‌, కోటేశ్వరమ్మ, అరుణ, చిష్టీ, రాజశేఖర్‌, జ్యోతిబసులను ఎన్నుకున్నారు. ముగింపు సభలో నాయకులు షేక్‌ హుస్సేన్‌వలి, ములకా శివసాంబిరెడ్డి, బాబుప్రసాద్‌, రాజ్యలక్ష్మి తదితరులు ప్రసంగించారు. 


Advertisement
Advertisement