దళితులంటే ప్రభుత్వానికి చుకలన

ABN , First Publish Date - 2021-04-17T05:32:13+05:30 IST

దళితులంటే ప్రభుత్వానికి, పోలీసులకు చులకన భావం నెలకొని ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు.

దళితులంటే ప్రభుత్వానికి  చుకలన
లంకెలకూరపాడు వెళ్తున్న ప్రజా సంఘాల నాయకులు, సీపీఎం నాయకులను అడ్డగిస్తున్న పోలీసులు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు 

ముప్పాళ్ళ, ఏప్రిల్‌ 16: దళితులంటే ప్రభుత్వానికి, పోలీసులకు చులకన భావం నెలకొని ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. మండలంలోని లంకెలకూరపాడులో ఎంపీటీసీ ఎన్నికల్లో  సర్పంచ్‌ మోర్తల వెంకటరెడ్డి మరో ఇద్దరు సీపీఎం కార్యకర్త, దళితనేత సుందరయ్యపై దాడి చేశారు. కేసు నమోదు చేసి వారం రోజులవుతున్నప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేయాలంటూ పెద్దసంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు కూరపాడు తరలి వెళ్తుండటంతో పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, వారం రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోవటం నిందితులకు పోలీసులు కొమ్ముకాయటమేనని విమర్శించారు. ఒక్క రోజులో అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గద్దె చలమయ్య, సీపీఐ నాయకులు నరిశెట్టి వేణుగోపాల్‌, ఏపీసీఎల్‌సీ రాష్ట్ర నాయకులు చిలకా చంద్రశేఖర్‌, మాల మహానాడు రాష్ట్ర నాయకులు గోదా జాన్‌పాల్‌, కాంగ్రెస్‌ నాయకులు బి.జ్ఞాన్‌రాజ్‌పాల్‌, దళిత సంఘాల నాయకులు చెల్లి కిషోర్‌, గుజ్జర్లపూడి అశోక్‌, గంజిమాల రవిబాబు, వంకాయలపాటి శివనాగరాణి, ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, గుంటుపల్లి బాలకృష్ణ, జానీ ఖాజావలి, జనసేన నాయకులు కేవీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T05:32:13+05:30 IST