పేదలకు పెన్షన్‌ పెంచుతామని మాట ఇచ్చి...: సీపీఎం మధు

ABN , First Publish Date - 2021-10-28T20:18:09+05:30 IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తలపెట్టిన పాదయాత్రకు సీపీఎం మద్దతు ఇస్తుందని సీపీఎం మధు తెలిపారు.

పేదలకు పెన్షన్‌ పెంచుతామని మాట ఇచ్చి...: సీపీఎం మధు

విజయవాడ: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తలపెట్టిన పాదయాత్రకు సీపీఎం మద్దతు ఇస్తుందని సీపీఎం మధు తెలిపారు. ఎన్నికల సందర్భంలో తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే మరింత మెరుగ్గా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని తెవడంతో.. ఫలితంగా అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయన్నాయి, అభివృద్ధి స్తంభించింది, వేలాది మంది ఉపాధి కోల్పోయారు, రాజధాని చిట్టడివిలాగా మారిందన్నారు. పూలింగ్‌ చట్టంలో రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రైతులకు కౌలు కూడా సకాలంలో చెల్లించడం లేదన్నారు. రైతులకిచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయలేదని చెప్పారు. పేదలకు పెన్షన్‌ పెంచుతామని మాట ఇచ్చి నయా పైసా కూడా పెంచలేదన్నారు.  

Updated Date - 2021-10-28T20:18:09+05:30 IST