ఇళ్ల తొలగింపు చర్యలు ఆపాలి

ABN , First Publish Date - 2022-07-08T03:47:01+05:30 IST

మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను తొలగించే పనిని ఆపాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

ఇళ్ల తొలగింపు చర్యలు ఆపాలి
నిరసన దీక్షలో సీపీఎం నేతలు

సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు

నెల్లూరు(వైద్యం), జూలై 7 : మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను తొలగించే పనిని ఆపాలని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని సత్యనారాయణపురంలో బాధితులతో కలిసి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి మాట్లాడుతూ మైపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న జాఫర్‌ సాహెబ్‌ కాలువ కట్ట, శ్రీనివాసనగర్‌ ప్రాంతాల్లో ఇళ్లను తొలగించే చర్యలను ఆపాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రైల్వే స్థలాల బాధితులకు యుద్ధప్రాతికన ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. 6 అంకణాల స్థలంలో రూ. 1.80 లక్షలతో ఇళ్ల నిర్మించటం సాధ్యం కాదని, రూ. 6 లక్షలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నరసింహా, ఉడతా ప్రసాద్‌, ఏమేలు, చిరంజీవి, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-08T03:47:01+05:30 IST