ఆర్వోబీపై గుంటలు పూడ్చండి మహాప్రభూ...

ABN , First Publish Date - 2022-01-22T03:50:33+05:30 IST

కావలి పట్టణం ఉదయగిరి రోడ్డులో ఉన్న ఆర్వోబీ రోడ్డుపై ఉన్న గుంటలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని పూడ్చాలని సీపీఎం కావలిపట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య పేర్కొన్నారు.

ఆర్వోబీపై గుంటలు పూడ్చండి మహాప్రభూ...
ఆర్డీవో కార్యాలయ ఏవోకి వినతిపత్రం ఇస్తున్న సీపీఎం నేతలు

కావలి, జనవరి 21: కావలి పట్టణం ఉదయగిరి రోడ్డులో ఉన్న ఆర్వోబీ రోడ్డుపై ఉన్న గుంటలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని పూడ్చాలని సీపీఎం కావలిపట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య పేర్కొన్నారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కావలి ఆర్డీవో కార్యాలయంలో ఏవో నాగలక్ష్మికి వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్వోబీ నిత్యం రాకపోకలతో రద్దీగా ఉంటుందన్నారు. పట్టణం సగభాగం రైల్వే ట్రాక్‌కు పడమర వైపున ఉన్నందున ప్రజలకు రాకపోకలకు ఈ వంతెన మార్గమే ప్రధానమన్నారు. ఆ వంతెనపై గుంటలు పడి ఐదారు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహన చోదకులు ఆ గుంటలలో పడటం లేదా గుంటలను తప్పించబోయి పక్కకు తిప్పగా వెనుకవైపు నుంచి వేగంగా వస్తున్న వాహనాలు డీకొనటంతో ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జీ. మధుసూదన్‌, వై.కృష్ణ మోహన్‌, పెంచలనరసింహం, సీఐటీయూ రవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T03:50:33+05:30 IST