ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-18T06:15:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్ట సవరణలతో ప్రమాదం పొంచి ఉందని, విద్యుత్‌ నియంత్రణ మండలి హైదరాబాద్‌ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు.

ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతున్న ప్రభుత్వం
విద్యుత్‌ బిల్లులను పరిశీలిస్తున్న బాబూరావు

 ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతున్న ప్రభుత్వం

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు  సీహెచ్‌. బాబూరావు

అజిత్‌సింగ్‌నగర్‌, ఆగస్టు 17 : కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్ట సవరణలతో ప్రమాదం పొంచి ఉందని, విద్యుత్‌ నియంత్రణ మండలి హైదరాబాద్‌ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పని చేయాలని సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌, వాంబేకాలనీ, రాజీవ్‌నగర్‌, వడ్డెర కాలనీ ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించి పలు చోట్ల విద్యుత్‌ బిల్లులను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. 

దొడ్డిదారిన పలు రూపాల్లో విద్యుత్‌ భారాలను  ప్రజలపై మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ. 2900 కోట్ల వసూళ్లు ప్రారంభించారని, 36 నెలల పాటు ఈ భారం ప్రజలపై పడనుందని తెలిపారు. మరో రూ. 630 కోట్లు ట్రూఅప్‌ భారం వేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ సన్నద్ధం అయ్యారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఇస్తున్న రాయితీని క్రమంగా ఎత్తివేయడానికి పూను కుంటున్నారని ఆరోపిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడ బలుక్కుని బడా కంపెనీల ప్రయోజనాల కొరకు సాధారణ ప్రజలను బలి చేస్తున్నారన్నారు. విద్యుత్‌ నియంత్రణ మండలి తూతూ మంత్రంగా విచారణ జరిపి ప్రభుత్వం భారాలు పెంచడానికి ఆమోద ముద్ర వేస్తోందన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది ఏళ్లు దాటినా విద్యుత్‌ నియంత్రణా మండలి హైదరాబాద్‌ నుంచి పనిచేయడం విచారకరమన్నారు. ఈఆర్‌సీ కార్యాలయాన్ని తక్షణమే రాష్ట్రానికి  తరలించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-18T06:15:32+05:30 IST