Abn logo
Sep 27 2021 @ 12:10PM

ఇది ప్రజల బంద్...పార్టీల బంద్ కాదు: Tammineni

హైదరాబాద్: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ బంద్‌కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం బంద్ ఉద్దేశం కాదన్నారు. 51 కంపెనీలకు కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని...అయినా రెండు కంపెనీలకే ఉత్పత్తి చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. ఆరు లక్షల కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. బస్సులను, రైళ్లను కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే నల్ల చట్టాలు తెచ్చారని... వీటికి వ్యతిరేకంగానే ఈ రోజు బంద్ చేపడుతున్నట్లు చెప్పారు. ఇది ప్రజల బంద్...పార్టీల బంద్ కాదని తమ్మినేని స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...