ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలి

ABN , First Publish Date - 2021-10-26T03:24:13+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరు ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శ్రీరాములు పేర్కొన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరాములు

ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరు ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తూ 600 మంది వరకు ప్రాణాలర్పించినా మోదీ ప్రభుత్వానికి చలనం లేదన్నారు. దేశాన్ని బకాసురుడు రాజ్యమేలుతున్నాడన్నారు. వ్యవసాయరంగంపై 67 శాతం మంది ఆధారపడి ఉన్నారని, అలాంటి రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి వెంకమరాజు, బండగానిపల్లి ఎంపీటీసీ విజయమ్మ, నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T03:24:13+05:30 IST