ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-04-13T05:44:44+05:30 IST

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వం

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు  రమణ 

చిట్యాల, ఏప్రిల్‌ 12 : రాష్ట్ర వ్యాప్తం గా ప్రజా సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.వి. రమణ విమర్శించారు. పార్టీ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సోమవారం మండలంలోని కైలాపూర్‌, చిట్యాల, తిర్మలాపురం, నవాబుపేట, జూకల్లు, చల్లగరిగ గ్రామాల్లో కొనసాగింది. రమణ మాట్లాడుతూ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, స్థానిక ఆస్పత్రి అప్‌గ్రేడెషన్‌, వ్యవసాయరుణాల మాఫీ తదితర హామీలు కలగానే మిగిలిపోయాయన్నారు. మిర్చి పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నేప థ్యంలో పంట నిల్వల కోసం కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్‌ నాయకుడు కుంజా బొజ్జి మరణం కమ్యూనిస్టు ఉధ్యమానికి తీరనిలోటన్నారు. పాదయాత్రలో పార్టీ జిల్లాకార్యదర్శి బందు సాయిలు, నాయ కులు బొట్ల చక్రపాణి, చద్రమౌళి, పాదయాత్ర బృందం సభ్యులు దేవేందర్‌, పసుల వినయ్‌, అరవింద్‌, దామెర కిర ణ్‌, రాజేందర్‌, శ్రీకాంత్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:44:44+05:30 IST