పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దు: Madhu

ABN , First Publish Date - 2022-07-02T16:09:57+05:30 IST

ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద ధర్నాలో సీపీఐ రామకృష్ణ(CPI Ramakrishna),

పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దు: Madhu

Vijayawada : ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద ధర్నాలో సీపీఐ రామకృష్ణ(CPI Ramakrishna), సీపీఎం మధు(CPM Madhu), ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. సీఎం జగన్(CM Jagan) మాటలకు, చేతలకు పొంతనే ఉండటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలపై జగన్ ప్రభుత్వం భారాలు మోపిందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు(RTC charges) పెంపును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలను మోపవద్దన్నారు. ప్రధాని మోదీ(PM Modi)కి దాసోహమై ఏపీలో జగన్ పాలన చేస్తున్నారని మధు పేర్కొన్నారు. ప్రతిపక్ష టీడీపీ(TDP), జనసేన(Janasena) కూడా కేంద్రం తప్పులను ప్రశ్నించలేక పోతోందన్నారు. జనంతో జనసేన అన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రజల పక్షాన పోరాడాలన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీ నిర్ణయాలపై నిరసన తెలపాలన్నారు. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చారన్నారు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కి పిలుపునిస్తామన్నారు. జనసేన, టీడీపీ కూడా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించాలని మధు పేర్కొన్నారు.

Updated Date - 2022-07-02T16:09:57+05:30 IST