Abn logo
Sep 23 2021 @ 11:25AM

‘విపక్షాల గొంతునొక్కి తప్పులను కప్పి పుచ్చాలని జగన్ యత్నం’

విజయవాడ:  డ్రగ్స్ అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆందోళనకు దిగింది.  ఈ సందర్భంగా  సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ మోడీ, జగన్ సర్కార్‌లు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని... కానీ పోర్ట్‌లు, రైల్వే, విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేశారని విమర్శించారు. ఆ పోర్ట్‌లను అడ్డం పెట్టుకుని గౌతమ్ అదానీ మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుంచి ఎక్కడెక్కడికి పంపారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అండతోనే ఈ చీకటి వ్యాపారం సాగుతుందని ఆయన అన్నారు. దేశ యువతను మత్తులో దించి కోట్లు కూడేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


విజయవాడ అడ్రస్‌తో వ్యాపారం చేసిన సుధాకర్ పాత్ర చాలా తక్కువ అని... అసలు సూత్రధారుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేసే ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. ఏపీ విపక్షాల గొంతు నొక్కి తప్పులను కప్పి పుచ్చాలని జగన్ యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాల రవాణాతో దేశ భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసి అసలు దోషులను శిక్షించాలని తెలిపారు. డ్రగ్స్ రవాణాకి మోడీ సర్కారే పూర్తి బాధ్యత వహించాలని బాబూరావు అన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption