Abn logo
May 23 2020 @ 16:56PM

వలస కార్మికులకు సీపీఎం చేయూత

విజయవాడ: వలస కార్మికులకు సీపీఎం చేయూతనిస్తోంది. బెజవాడ బెంజ్‌ సర్కిల్‌లో సీపీఎం సేవా శిబిరం ఏర్పాటు చేసింది. 1500మంది వలస కార్మికులకు ఆహార పదార్థాలు అందజేశారు. కాలినడకన వచ్చేవారికి పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత బాబురావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల వెతలు తీర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. సైకిళ్లు, లారీలపై వేల సంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తూనే ఉన్నారని, కోర్టులు తీర్పులు ఇస్తున్న ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయడం లేదని బాబురావు మండిపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement