వాస్తవాలు తెలియజేసేందుకూ అవకాశమివ్వరా..?

ABN , First Publish Date - 2020-08-04T10:36:12+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి భద్రత కరువైందని.. జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ..

వాస్తవాలు తెలియజేసేందుకూ అవకాశమివ్వరా..?

కరోనా నియంత్రించమంటే అక్రమ అరెస్టులా..!

సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌


అనంతపురం టౌన్‌, ఆగస్టు 3: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి భద్రత కరువైందని.. జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో కరోనా బాధితుల బాధలు, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మాకు అవకాశం ఇవ్వరా..? అంటూ సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌ మండిపడ్డారు. సోమవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానిని కలిసేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో సమావేశానికి మంత్రి హాజరవుతారని తెలుసుకుని వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకుని వారిని రెండో పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడడంలో అధికార యంత్రాంగంలో సమన్వయం లోపించిందని, ఇది జిల్లా ప్రజలకు శాపంగా మారిందన్నారు.


  జిల్లాలో 15వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇప్పటికే 200 మందికి పైగా మృతి చెందారన్నారు. అలాగే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఒక్కో కరోనా బాధితుడికి రూ.500లు చొప్పున రోజుకు చెల్లిస్తుంటే కనీసం రూ.200 విలువచేసే భోజనం కూడా పెట్టడం లేదన్నారు.   ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు బాలరంగయ్య, జిల్లా కమిటీ స భ్యుడు కసాపురం ఆంజనేయులు, నగర కమిటీ నాయకులు గోపాల్‌, ప్రకాష్‌, వెంకటనారాయణ తదితరులు ఉన్నారు. అనంతరం పోలీసులు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Updated Date - 2020-08-04T10:36:12+05:30 IST