భోగి మంటల్లో రైతు, మున్సిపల్‌ చట్టాల ప్రతులు

ABN , First Publish Date - 2021-01-14T04:42:58+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మున్సిపల్‌ చట్టాలకు వ్యతిరేకంగా సీపీఎం నేతలు ఆ చట్టాల ప్రతులను భోగిమంటల్లో తగులబెట్టారు.

భోగి మంటల్లో రైతు, మున్సిపల్‌ చట్టాల ప్రతులు
భోగి మంటల్లో ప్రతులను తగుల బెడుతున్న నేతలు

సీపీఎం నేతల నిరసన

నెల్లూరు(వైద్యం), జనవరి 13 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మున్సిపల్‌ చట్టాలకు వ్యతిరేకంగా సీపీఎం నేతలు ఆ చట్టాల  ప్రతులను భోగిమంటల్లో తగులబెట్టారు. బుధవారం తెల్లవారుజామున నెల్లూరు నగరంలోని డైకాస్‌రోడ్డులో వేసిన భోగి మంటల్లో ఈ ప్రతులను దహనం చేశారు. సీపీఎం నెల్లూరు రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు, మున్సిపల్‌ చట్టాలను రద్దు చేసే వరకు సింహపురి సమాఖ్య, ప్రజాసంఘాలతో కలిసి  పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, పౌరసమాఖ్య నేతలు సిరాజుద్దీన్‌, కాలేషా, ప్రసాద్‌, బాజీ, హఫీజ్‌, భరత్‌, షంషాద్‌, లక్ష్మీ నరసమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:42:58+05:30 IST