పెద్దోళ్లకు రాయితీలు.... పేదోళ్లకు పన్నులా?

ABN , First Publish Date - 2021-06-18T05:01:08+05:30 IST

ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి పేదోడి రక్తాన్ని పీల్చుకోవాల్సిన అవసరం లేదని, ఖరీదైన వాళ్లకు రాయితీలిచ్చి నిరుపేదలపై పన్నుల భారం వేయడం సబబుకాదని సీపీఎం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పన్ను పెంపునకు సిద్ధమవుతుండటాన్ని నిరసిస్తూ నగరంలోని వార్డు సచివాలయాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టాయి.

పెద్దోళ్లకు రాయితీలు.... పేదోళ్లకు పన్నులా?
సచివాలయం ఎదుట సీపీఎం ఆందోళన

సచివాలయాల వద్ద సీపీఎం నిరసన 

నెల్లూరు (సిటీ), జూన్‌ 17 : ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి పేదోడి రక్తాన్ని పీల్చుకోవాల్సిన అవసరం లేదని, ఖరీదైన వాళ్లకు రాయితీలిచ్చి నిరుపేదలపై పన్నుల భారం వేయడం సబబుకాదని సీపీఎం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పన్ను పెంపునకు సిద్ధమవుతుండటాన్ని నిరసిస్తూ నగరంలోని వార్డు సచివాలయాల ఎదుట గురువారం ఆందోళన చేపట్టాయి. నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్‌ మాట్లాడుతూ ఆస్తి విలువలతో లెక్కకట్టి ఇంటి పన్నులను విధించే ప్రభుత్వాన్ని దేశంలో ఏపీలోనే చూస్తున్నామన్నారు. కేవలం ఆదాయమే లక్ష్యంగా జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. వెంటనే పన్నుల నూతన విధానాన్ని ఉపసంహరించుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నాయకులు, సింహపురి పౌర సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:01:08+05:30 IST