Abn logo
Apr 23 2021 @ 23:20PM

భూముల అమ్మకంపై కోర్టు తీర్పు హర్షణీయం

ప్రజల ఆస్తులు అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు : సీపీఐ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23: విశాఖలో ప్రభుత్వ భూములు అమ్మాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడం హర్షణీయమని  సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు అన్నారు. బీచ్‌ రోడ్డులో లూలూమాల్‌కు ఇచ్చిన ఏపీఐఐసీ భూములు, పెదగంట్యాడ పకీర్‌ తకియాలోని ఆస్తులను వైసీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం తప్పని, ప్రజల ఆస్తిని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు పేరుతో అక్రమ అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని, ఒకవేళ కాదని అమ్మకాలు జరిపినా సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం నేరం అవుతుందన్నారు. 

Advertisement