విజయవాడలో రాజధాని పెట్టాలని సీపీఐ కోరింది: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-01T22:42:15+05:30 IST

1953లో మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా.. విజయవాడలో రాజధాని పెట్టాలని సీపీఐ కోరిందని ఆ పార్టీ నేత రామకృష్ణ గుర్తుచేశారు.

విజయవాడలో రాజధాని పెట్టాలని సీపీఐ కోరింది: రామకృష్ణ

అమరావతి: 1953లో మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా.. విజయవాడలో రాజధాని పెట్టాలని సీపీఐ కోరిందని ఆ పార్టీ నేత రామకృష్ణ గుర్తుచేశారు. అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో సీపీఐ తరపున రామకృష్ణ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య.. ఏపీ రాజధాని ఉండాలని సీపీఐ 2014 జూన్‌లోనే ప్రకటించిందని తెలిపారు. అమరావతి రాజధానిగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు అనువైన ప్రదేశమని, ఇప్పటికే అమరావతిలో రూ.10 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు రాజధానిని మార్చడం మరింత ఖర్చుతో కూడినదని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T22:42:15+05:30 IST