ఘనంగా సీపీఐ పట్టణ మహాసభ

ABN , First Publish Date - 2022-07-04T05:07:03+05:30 IST

పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ 10వ పట్టణ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పతాక ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు.

ఘనంగా సీపీఐ పట్టణ మహాసభ
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య

బద్వేలు,జూలై 3: పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ 10వ పట్టణ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పతాక ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలకు రాష్ట్రప్రభుత్వం తలొగ్గిందన్నారు. అలాగే రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, బీఎ్‌సఎన్‌ఎల్‌, విద్యుత్‌, రోడ్లు, రైల్వేష్టేషన్‌, ఫ్లాట్‌ఫామ్‌లో అన్ని కార్పొరేట్‌ శక్తులకు అమ్మకానికి పెట్టడమే కాకుండా అగ్నిపథ్‌తో  విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ,ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకం పెట్టడానికి  వాటిని సాధించేందుకు ఏం పోరాటాలు చేసిందని, అలాంటపుడు వాటిని అమ్మే హక్కు మీకు లేదని  ఆయన ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సబ్యులు గాలి చంద్ర, వీరశేఖర్‌, ఏరియా కార్యదర్శి జకరయ్య, జిల్లా సమితి సభ్యులు చంద్రమోహన్‌ రాజు, పిడుగు మస్తాన్‌, బాలు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు విజయమ్మ,  రామరాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:07:03+05:30 IST