ప్రభుత్వ వైఫల్యాలపై సీపీఐ నిరసన ప్రదర్శనలు

ABN , First Publish Date - 2020-06-02T09:54:21+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలపై సీపీఐ నిరసన ప్రదర్శనలు

ప్రభుత్వ వైఫల్యాలపై సీపీఐ నిరసన ప్రదర్శనలు

  • నేటి నుంచి వారం రోజుల పాటు 
  • నేడు పీపుల్స్‌ డిమాండ్స్‌ డే -  ఆన్‌లైన్‌ సభ 

హైదరాబాద్‌, జూన్‌ 1  (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 2 నుంచి 10 వరకు వారం రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  ఈనెల 2న డిమాండ్స్‌ డేగా ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,  సాయంత్రం ఆన్‌లైన్‌లో వామపక్ష పార్టీలతో కలిసి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 3న విద్యుత్తు సవరణ బిల్లు 2020ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాలకు జీఎ్‌సటీ బకాయులు చెల్లించాలని కేంద్రానికి లేఖలు రాయాలని, 4న నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు,  6న నల్లగొండ-సూర్యాపేట, 7న ఖమ్మం, 8న మహబూబ్‌నగర్‌, 9న రంగారెడ్డి జిల్లాల్లో సదస్సులు, 10న నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. కాగా, ఉద్యమ కాలంలో వెల్లివిరిసిన ఆకాంక్షలు నేటికీ అమలుకు నోచుకోలేదని సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమాక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.గోవర్థన్‌ సోమవారం ఒక ప్రకటనలో  విమర్శించారు. 

Updated Date - 2020-06-02T09:54:21+05:30 IST