వైసీపీ సర్కార్‎పై మండిపడ్డ CPI Ramakrishna

ABN , First Publish Date - 2021-10-23T17:02:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వ పాలనపై, వైసీపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడంతో ఏపీ దివాళా తీసిందన్నారు. లక్షలాది

వైసీపీ సర్కార్‎పై మండిపడ్డ CPI Ramakrishna

అమరావతి: వైసీపీ ప్రభుత్వ పాలనపై, వైసీపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడంతో ఏపీ దివాళా తీసిందన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తెస్తే తప్పా అభివృద్ధి లేదని, ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రి సమాధానం చెప్పడం లేదన్నారు. అప్పులు తెస్తే తప్ప రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు‌. మంత్రులందరూ డమ్మీలని రామకృష్ణ విమర్శించారు. రెండున్నరేళ్లలో ఏ పార్టీ వారూ సీఎం జగన్‎ని కలవలేకపోయారని, ఏపీలో ఒన్ మ్యాన్ షో పాలన కొనసాగుతుందన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందన్నారు. దళితులపైన అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి రాష్ట్రం దిగజారారని మండిపడ్డారు. పట్టాభిని అరెస్ట్ చేసి, ఆయన ఇంటిపైన, టీడీపీ కార్యాలయంపై దాడి చేసి వారిని అరెస్ట్ చేయరా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజలు పోరాటానికి సమాయత్తం అవుతున్నారన్నారు. చంద్రబాబు కోరినట్టు రాష్ట్రపతిపాలన పెడితే, జగన్ నెత్తిన పాలు పోసినట్టేనని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-23T17:02:57+05:30 IST