Abn logo
Jul 13 2020 @ 09:20AM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామకృష్ణ లేఖ

అమరావతి : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖలు రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి విరసం నేత వరవరరావును బెయిల్ పైన గానీ పెరోల్ పై గానీ విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని.. అనారోగ్యంతో ఉన్న ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వైద్యం చేయడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న వరవరరావు ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది ప్రభుత్వం చేసిన ఎన్‌కౌంటర్‌తో సమానమని రామకృష్ణ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement
Advertisement