Andhra news: కేంద్రమంత్రి అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గం: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-07-20T20:59:35+05:30 IST

విభజన హామీలు ఇప్పటికే అమలు చేశామని, కేంద్రం ప్రకటించడాన్ని తప్పు బడుతున్నామని సీపీఐ నేత రామకృష్ణ

Andhra news: కేంద్రమంత్రి అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గం: రామకృష్ణ

విజయవాడ: విభజన హామీలు ఇప్పటికే అమలు చేశామని, కేంద్రం ప్రకటించడాన్ని తప్పు బడుతున్నామని సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna) ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ (Union Minister Nityanand Rai)  అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రైల్వేజోన్ (Railway Zone) లేదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు లేవన్నారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయకుండా వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ (CM Jagan) పక్కా మోసగాడిగా నేడు చరిత్రలో నిలిచిపోయారని రామకృష్ణ పేర్కొన్నారు.


ప్రత్యేక హోదాపై కేంద్రం పాతపాటే పాడింది. హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈ అంశంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు (Rammohan Naidu) అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు. నిజానికి ఈ అంశాన్ని జగన్‌  ఎప్పుడో వదిలేశారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రం ‘నో’ అన్నా ఆయనది మౌనమే. ‘‘ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను నమ్మొద్దు. బీజేపీ (BJP)ని నమ్మొద్దు. చంద్రబాబును, ఆయన పార్టనర్‌ను నమ్మొద్దు. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామంటారో, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్లకే మద్దతిస్తాం. మన ఎంపీలను మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు. పెట్టిన తర్వాతనే నీకు మద్దతిస్తాం అని చెబుతానని మీకు హామీ ఇస్తున్నా’’ అని 2018 నవంబరు 28న పాలకొండలో జరిగిన సభలో జగన్‌ ప్రకటించారు.

Updated Date - 2022-07-20T20:59:35+05:30 IST