అమరావతి: తెలుగు ప్రజలందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది అంటే తీపి, చేదుల కలయిక అని... కానీ ప్రభుత్వాలు ప్రజలకు చేదునే మిగిల్చాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారాలు మోపిన నేపథ్యంలో ఈ ఏడాదిని ఉద్యమ నామ సంవత్సరంగా పరిగణించాల్సి ఉందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి, చెత్త పన్నుల పెంపు వంటి భారాలు ప్రజలకు గుదిబండగా మారాయని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి