‘పులివెందుల’ ఏకగ్రీవం దారుణం: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2021-03-04T08:50:07+05:30 IST

‘‘జగన్‌ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు. ఎన్నికలంటే జగన్‌కు భయమెందుకు? ప్రతిపక్షాలను, స్వతంత్ర అభ్యర్థులను కూడా పోటీ చేయనివ్వకుండా

‘పులివెందుల’ ఏకగ్రీవం దారుణం: సీపీఐ రామకృష్ణ

కడప, అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు. ఎన్నికలంటే జగన్‌కు భయమెందుకు? ప్రతిపక్షాలను, స్వతంత్ర అభ్యర్థులను కూడా పోటీ చేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏకగ్రీవాలు చేసుకోవడమే ప్రజాస్వామ్యమా?’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం కడప నగరంలో సీపీఐ అభ్యర్థుల ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో ప్రజాస్వామ్యానికి సమాధి కడుతూ మోదీ తరహాలోనే జగన్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలోనే 33 స్థానాలు ఉంటే అన్నీ ఏకగ్రీవం చేయడం దారుణమన్నారు.


ఒక వైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటిస్తే.. పొడుస్తాం, చించుతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలని ఎద్దేవా చేశారు. బీజేపీతో దోస్తీ చేసిన పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కుపై నోరు మెదపలేదన్నారు. 5న జరిగే రాష్ట్ర బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-03-04T08:50:07+05:30 IST