పీఎఫ్ వడ్డీ రేటు కోత అన్యాయం: కేరళ ఎంపీ

ABN , First Publish Date - 2022-03-13T00:18:58+05:30 IST

తాజా ఎన్నికల్లో గెలిచిన వెంటనే పీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్రం తన అసలు రంగు బయటపెట్టిందని విమర్శించారు కేరళ ఎంపీ, సీపీఐ పార్లమెంట్ నేత బినోయ్ విశ్వమ్. ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు.

పీఎఫ్ వడ్డీ రేటు కోత అన్యాయం: కేరళ ఎంపీ

తాజా ఎన్నికల్లో గెలిచిన వెంటనే పీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా కేంద్రం తన అసలు రంగు బయటపెట్టిందని విమర్శించారు కేరళ ఎంపీ, సీపీఐ పార్లమెంట్ నేత బినోయ్ విశ్వమ్. ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గిస్తూ కేంద్రం శనివారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బినోయ్ విశ్వమ్, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని లేఖలో కోరారు. ‘‘పీఎఫ్ వడ్డీ రేటును తగ్గించడం ద్వారా దేశం కోసం పనిచేస్తున్న ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సానుభూతి లేదని స్పష్టమవుతోంది. స్పష్టమైన కారణాలు చూపకుండానే కేంద్రం వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తోంది. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం పనిచేయాల్సిన ఈపీఎఫ్ఓ అన్యాయంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాదిమంది సభ్యులు, పెన్షనర్లపై ప్రభుత్వ నిర్ణయం మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగులు చాలా నష్టపోతారు. దేశ ప్రగతికి దోహదపడుతున్న ఉద్యోగుల విషయంలో ఇలాంటి నిర్ణయం సరికాదు. కేంద్రం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని సమీక్షించి, వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలి’’ అని బినోయ్ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-03-13T00:18:58+05:30 IST