ప్రజలు చెత్తపన్ను చెల్లించొద్దు

ABN , First Publish Date - 2021-11-30T05:50:36+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా విధించిన చెత్త పన్నును ప్రజలు ప్రతిఘటించి, చెల్లించవద్దని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పిలుపునిచ్చారు.

ప్రజలు చెత్తపన్ను చెల్లించొద్దు
అజిత్‌సింగ్‌నగర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నేతలు

ప్రజలు చెత్తపన్ను చెల్లించొద్దు

సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌

అజిత్‌సింగ్‌నగర్‌, నవంబరు 29: వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా విధించిన చెత్త పన్నును ప్రజలు ప్రతిఘటించి, చెల్లించవద్దని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పిలుపునిచ్చారు. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. చెత్త పన్ను- చెత్త నిర్ణయం నినాదంతో అజిత్‌సింగ్‌నగర్‌ కృష్ణాహోటల్‌ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యాన సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా ఆఖరికి రశీదులు లేకుండా వలంటీర్లతో చెత్త పన్ను వసూళ్లకు పాల్పడటం చట్టవిరుద్దమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి చెత్త పన్ను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజల ఆగ్రహం చవిచూడాలసి వస్తుందని హెచ్చరించారు. నగర కార్యదర్శివర్గ సభ్యుడు కేవీ భాస్కరరావు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంతో పాటు థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తుంటే ఆదుకోవాలసిన ప్రభుత్వం పన్ను భారం మోపడం అత్యంత దుర్మార్గమని ఖండించారు. షేక్‌ సుభాని, శివకుమార్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

చెత్తపై పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలి

రామలింగేశ్వర్‌నగర్‌ : చెత్తసేకరణపై విధించిన యూజర్‌ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం బబీజజేపీ ఓబీసీ మోర్చా నగర మాజీ అధ్యక్షుడు దార్న చంద్రశేఖర్‌రావు ఆఽధ్వర్యంలో సర్కిల్‌-3 జోనల్‌ కమిషనర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ  చెత్తపై పన్ను రద్దు చేయాలని  డిమాండ్‌ చేశారు. సరికొండ లక్ష్మీపతిరాజు, ఏఎల్‌ లక్ష్మీనరసింహరావులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T05:50:36+05:30 IST