రైతులను అడగకుండానే భూములు లాక్కుంటారా?

ABN , First Publish Date - 2021-07-27T08:34:56+05:30 IST

‘‘ఉరి శిక్షపడే ఖైదీకి కూడా చివరి కోరికేమిటని అడుగుతారు. దానిని తీర్చిన తర్వాతే ఉరికంబం ఎక్కిస్తారు. అయితే అన్నంపెట్టే రైతులను మాత్రం ఏమీ అడగకుండా భూములను లాక్కోవడానికి రాష్ట్ర

రైతులను అడగకుండానే భూములు లాక్కుంటారా?

2013 కేంద్ర చట్టం ప్రకారం భూ పరిహారం ఇవ్వాలి: నారాయణ 


చిత్తూరు, జూలై 26: ‘‘ఉరి శిక్షపడే ఖైదీకి కూడా చివరి కోరికేమిటని అడుగుతారు. దానిని తీర్చిన తర్వాతే ఉరికంబం ఎక్కిస్తారు. అయితే అన్నంపెట్టే రైతులను మాత్రం ఏమీ అడగకుండా భూములను లాక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చిత్తూరు-తచ్చూరు జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భూములను సేకరిస్తున్నాయని.. రైతులతో పలు దఫాలుగా చర్చించి వారికి పరిహారం చెల్లించాక తీసుకోకుండా.. ఇచ్చిన ధరలను తీసుకోవాలని భయాందోళనకు గురిచేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేశారు.


2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఇవ్వకుండా రేషన్‌కార్డులు, పెన్షన్లను కట్‌ చేస్తామని చెప్పే అధికారుల నాలుక కోస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. గేటును తోసుకుని లోనికి వెళ్లడానికి రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించారు. నారాయణను అరెస్టు చేసి యాదమరి పోలీ్‌సస్టేషన్‌కు తరలించిన అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. 

Updated Date - 2021-07-27T08:34:56+05:30 IST