కోవిడ్‌ మాటున ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం

ABN , First Publish Date - 2020-08-11T11:01:39+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయ ణ ఆరోపించారు.

కోవిడ్‌ మాటున ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం

 సీపీఐ జాతీయ కార్యదర్శి..డాక్టర్‌ కె.నారాయణ


సుబేదారి. ఆగస్టు 10: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయ ణ ఆరోపించారు. హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆర్‌ఎ్‌సఎస్‌ వంటి మత సంస్థతో కలిసి శంకుస్థాపన చేయడం సరికాదన్నారు. దేశంలో 130కోట్ల మంది ప్రజలకు మోదీ ప్రధాని అని, కేవలం హిందువులకు మాత్రమే కాదన్నారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారన్నారు. ‘రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదంతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని నారాయణ పిలుపునిచ్చారు.


కోవిడ్‌ను అడ్డు పెట్టుకుని లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కోవిడ్‌ విజృంభణలో ప్రపంచంలోనే భారత్‌ 3వ స్థానానికి చేరుకుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చా డ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ బారి నుంచి ప్ర జలను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక కరోనా బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకుంటున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివా్‌సరావు, నేదునూరి జ్యోతి, అర్బన్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, నగర కార్యదర్శి షేక్‌ బాషుమియా, నాయకలు బుస్సా రవీందర్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


కాళిదాసు  కుటుంబానికి పరామర్శ..

ఇటీవల మృతిచెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు మడత కాళిదాసు కుటుంబసభ్యులను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పరామర్శించారు. సోమవారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని కాళిదాసు నివాసానికి వెళ్లి ఆయన భార్య భారతిని ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సీపీఐ కార్యాలయంలో కాళిదాసు సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులర్పించారు. 

Updated Date - 2020-08-11T11:01:39+05:30 IST