Abn logo
Sep 23 2021 @ 03:17AM

‘కార్పొరేట్‌’కు దోచిపెడుతున్న మోదీ

సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్‌ ధ్వజం


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి), కొత్తపట్నం(ఒంగోలు): ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ప్రధాని మోదీ దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినయ్‌ విశ్వం విమర్శించారు. ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో 6రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం ఒంగోలు నగరంలోని కొత్తపట్నం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ 27న భారత్‌ బంద్‌కు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏఐఎ్‌సఎఫ్‌ జాతీయ కార్యదర్శి తిరుమలై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యునైటెడ్‌ యూత్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కాబోతోందని తెలిపారు.

క్రైమ్ మరిన్ని...