అమరావతి : నిఘా వైఫల్యం వల్లే విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం పెరిగిందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. గుజరాత్ పోర్టుల నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో గంజా సరఫరా వెనుక వైసీపీ ఉందని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.