Abn logo
Oct 2 2020 @ 02:58AM

మీ నాన్న పేరు చెడగొడుతున్నావ్‌

Kaakateeya

  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ 

కొండాపురం, అక్టోబరు 1: ‘మీ నాన్న పేరుతో అధికారంలోకి వచ్చావ్‌.. ఆయన పేరును చెడగొడుతున్నావ’ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీఎం జగన్‌పై మండిపడ్డారు. గురువారం కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ముంపు గ్రామమైన తాళ్లప్రొద్దుటూరులో ఆందోళన చేస్తున్న నిర్వాసితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ తనకు ఆత్మీయుడని, ఆయన పేరును జగనే చెడగొడుతున్నారని మండిపడ్డారు.


గండికోట నిర్వాసితుల పునరావాస కాలనీల్లో కనీసం ప్లాట్లు కూడా విడగొట్టకుండా, రాత్రికి రాత్రే ప్రాజెక్టులో నీళ్లను నింపి.. గడువు కూడా ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. 29రోజులుగా నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా సీఎం గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అనంతరం.. గ్రామంలోకి వచ్చిన బ్యాక్‌వాటర్‌లో తెప్పను నడుపుకొంటూ ముంపునకు గురైన ఇళ్లను నారాయణ పరిశీలించారు. ఆ తర్వాత గండికోట ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించారు.  

Advertisement
Advertisement
Advertisement