మిలిటెంట్‌ ఉద్యమాలు తప్పవు

ABN , First Publish Date - 2022-08-10T05:17:26+05:30 IST

రాబోయే రోజుల్లో మోదీ, కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా మిలిటెంట్‌ ఉద్యమాలు తప్పవని సీపీఐ రాష్ట్ర స హాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.

మిలిటెంట్‌ ఉద్యమాలు తప్పవు
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

 దేశ సంపదను అమ్మేస్తున్న మోదీ 

అప్పుల ఊబిలో తెలంగాణ

 సీపీఐ రాష్ట్ర సహాయ  కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

పేట్‌బషీరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):  రాబోయే రోజుల్లో మోదీ, కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా మిలిటెంట్‌ ఉద్యమాలు తప్పవని సీపీఐ రాష్ట్ర స హాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.  సీపీఐ మేడ్చల్‌ జిల్లా 3వ సభ డెలిగెట్స్‌ కాన్ఫరెన్స రంగారెడ్డి నగర్‌లోని రాయల్‌ ఫంక్షనహాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ కుర్చీ కోసం మతం పేరుతో ప్రజల్లో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో నియంతృత్వం పెరిగిందని, ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందన్నారు. ఆర్థికంగా ఎంతో పటిష్టంగా ఉన్న తెలంగాణ కేసీఆర్‌ పాలనలో అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. ఐఎనటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  ఎం డీ. యూసుఫ్‌  మాట్లాడుతూ కుత్బుల్లాపూర్‌లో కా ర్యకర్తల త్యాగాలతో నిర్మించుకున్న పార్టీ ఇప్పటికీ ఇక్కడ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోందన్నారు. పార్టీ మహాసభలు కుత్బుల్లాపూర్‌లో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఐ కార్యదర్శి సాయిలుగౌడ్‌, రాష్ట్ర మున్సిపల్‌ వర్కర్స్‌ అధ్యక్షుడు ఏసురత్నం, కార్యవర్గ వర్గ సభ్యులు ఉమామహేష్‌, వెంకట్‌రెడ్డి, లక్ష్మి, కృష్ణమూర్తి, దశరథ్‌, సహదేవుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:17:26+05:30 IST