Abn logo
Sep 17 2021 @ 08:05AM

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను సహించం: Ramakrishna

తిరుపతి: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పెంచిందన్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతాంగం ఢిల్లీలో సుదీర్ఘ ఆందోళన చేస్తున్నా మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. కరోనా బూచిని అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు చర్యలు వేగవంతం చేసిందని అన్నారు. నేడు తిరుపతిలో రామకృష్ణ నేతృత్వంలో జన ఆందోళన్ పాదయాత్ర జరుగనుంది. 


ఇవి కూడా చదవండిImage Caption