Abn logo
Oct 26 2020 @ 10:19AM

డీజీపీ గౌతమ్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

అమరావతి: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం తగదన్నారు. 314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతోందని తెలిపారు. అమరావతికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మంగళగిరి ప్రాంతం నుంచి కృష్ణాయపాలెం వస్తున్న దళితుల్ని స్థానిక దళితులు అడ్డుకున్నారని... కానీ పోలీసులు రాజకీయ కోణంలో ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని కోరుతున్నట్లు రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement