అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ఎత్తును 135 అడుగులకు తగ్గించే కుట్రలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. పోలవరం మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి వంటిదన్నారు. పోలవరం నిర్మాణంపై కేంద్రం వైఖరికి మీరు తలొగ్గితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినవారవుతారని తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి