అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతిభ్రమించినట్లున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో! అని యెద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోందని మండిపడ్డారు. కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి